పరవశం .
తేది_02/05-01-24
శీర్షిక : ప్రతీది.
పరవశించే హృదయం నీకుంటే
ప్రతీ క్షణం ప్రతీ విషయం నీకు
పదనిసల ప్రమోద పరిశ్వంగమే
ప్రకృతి నిండా పల్లె చుట్టూరా ...
పొద్దు పొడిచినా..
శుకపికముల కువకువలు
సద్దు మణిగినా ..
కీచురాళ్ళ గానా బజానానే ...
రాయి ముట్టుకున్నా రాగాలే
నీరు ప్రవహించినా నీరాజనాలే
గాలి వీచినా గమ్మత్తులే
మేఘమురిమినా మురిపములే...
రెమ్మ చిగురించినా.. కోయిలమ్మ
గొంతెత్తుకున్నా… అంబారవముల
పశువు రంకె వేసినా…
అన్నీ రాగమయములే… సప్త స్వరాలే
అమ్మ మాటలే శిశువుకు పరవశం
భజనలే భగవంతినికి అనుసంధానం
ఎందరో మహానుభావులు
ఎదలనుర్రూతలూగించిన దాఖలాలు…
అందరికి కరమోడ్పుల వందనాలు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment