గుడి
తేది :10-01-2024
శీర్షిక : మోక్ష మార్గం
నాగరికత నడకలలో ఒక అడుగు
ధర్మ అర్థ కామ మోక్షముల వెదుకులాటలో
బడి తదుపరి గుడి వైపే ....
తనలోపలికి తాను ప్రయాణిస్తూ
అనేక మార్గాలను ఆసరా చేసుకున్నాడు.
శాస్త్ర సాంకేతికతల మేళవింపుతో
శబ్ద శాస్త్రం ఔపోషణలు ...
ఆధ్యాత్మికతల అడుగుజాడలు ....
నిత్య జీవన పరిక్రమలు....
పక్కా లెక్కలతో కొలతలతో
గర్భ గృహం ప్రదక్షిణ మార్గం
మండపం మొదలైనవి ... వాస్తు
శాస్త్రం ... శిల్ప శాస్త్రం కలగలిసిన
కమనీయతలు కుమ్మరించేవి ....
ఒకటవ శతాబ్దం నుండి
అందుబాటున్న ఆనవాళ్ళనేకం ...
అజంతా ఎల్లోరాలు ఆనంద వీచికలు
చాళుక్యులు ... హొయసల...
కాకతీయుల.... కాలములలో
ఒక వెలుగు వెలిగినవి ....
శరణాగతి శ్రేష్టమని
దాసోహమే సర్వోత్క్రుష్టమని
సంకల్పముల వేడుకొనుట
సముజ్వలమని... సన్మార్గం
నడిపించగా... సద్బుద్ధుల
సంఘం వర్ధిల్లగా....మోక్ష మార్గ
అన్వేషణలలో ..... గుడుల
పాత్ర అమోఘం ... అనన్యం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment