ఆధిపత్య పైత్యం
తేది : 07-02-2024
శీర్షిక : వాపు బలమనుకుందురు ...
అక్కడక్కడా ఆవరించినా
కొట్టొచ్చినట్ట్టు కనపడే వింత రోగం...
కొంత రంగులు పులుముకున్న రాజకీయ
రంగమునాశ్రయించిన బదనిక...
స్వార్ధము మింగిన కాలనాగులు
సంపద పుట్టలు పెంచుకుంటూ
కన్నూ మిన్నూ కాననీయక
సామాన్యులను కాటువేయడం ...
అధికారమే పరమావధిగా
నెత్తికెక్కి తైతక్కలాడగ
ఉచ్చ నీచములు మరిచి
కచ్చ గట్టి పెచ్చు మీరెదరు...
మానవత ముందు అంతా
బలాదూరని తెలిసినా ...
మంచిని గుర్తించక
కళ్ళు నెత్తికెక్కి కానకుందురు ....
కన్నూ మిన్నూ కాననీయదు
భ్రమలలో బ్రతికేరు ...
వాపును బలమనుకుని
వాటమైన రీతిన ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment