మనోరంజితాలు
తేది : 16-01-2024
శీర్షిక : మనోల్లాసాలు
చూపుల గాలం తగలగానే
సుందర మందిరమే మనోల్లాసం ....
మనసు ఊయలూగగానే
ఉల్లం జల్లని ఊరేగుతుంది ....
నందనవనమును ప్రదర్షింపజేసి
నయనానందములను అందించు ...
కంటి కాన్వాసుపై కమనీయ చిత్రంతో
కలల లోకం పరిచయింప చేయు ....
మనో పరవశాల మందిరమై
పరివ్యాప్తంతో పరమానందం...
పరిసరాల మరిపింతలతో
మరోలోకంలో పయనింపజేయు ...
పరిమళాలను వ్యాపింప జేసి
ముక్కు పుటాల పటాలమును
పలకరింపులతో ప్రసన్నతలు
కుమ్మరించి పరవశాల పాత్రవుతుంది ...
మల్లె చామంతుల మరువ
దమనాలు...మనమును
పలకరించే మంచి మిత్రులు
మనోల్లాసాల మనోరంజితాలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment