నవ్వుల వెలుగులు.
తేది 11-01-2024
శీర్షిక : త్యాగాల వెన్న కరిగితేనే….
నలుగురు వెంబడి లేకుండా
నవ్వుల్లో వెలుగు సుమాలు ఎన్ని పూసినా…
పూయకపోయినా… ఎవరికి తెలుస్తుంది…?
చూసినా చూడకపోయినా ఆనందం
ఎవరికి కలుగుతుంది… ?ప్రపంచానికే
నీ పరిచయం లేనప్పుడు…
ఎంతసేపు నీ నవ్వులు నీ వెలుగులు
ఎవరికి మాత్రం మొహం మొత్తదు…
అప్పుడప్పుడైనా అందరికి పంచాలి..
అందులో ఆనందం వెదుక్కోగలగాలి…
ఇతరుల నవ్వుల్లో వెలుగులు
విరజిమ్మాలంటే త్యాగాల వెన్నలు కరిగి
పోవాల్సిందే.. ఆ మనసే నీకుంటే
అవధిలేని ఆనందాల హరివిల్లే ...
స్వార్థాల ధవళ వస్త్రాలు ఎన్ని ధరిస్తే ఏంటి?..
కొందరు..వెలుగులు విరజిమ్మరు.. కనీసం
దరిదాపులకు కూడా రారు...
ఆ వెలుగుల
ఆనందం కూడా పొందరు.. పొందనీయరు…
పొరపాటున ఎవరైనా వెలుగులు
విరజిమ్ముతుంటే..ఇతరుల జీవితాలు
వెలిగిపోతుంటే కూడా ఈర్ష్యపు చూపులు
చూడనీయవు. కపటపు మసి పూసి..
అది వారి ఖాతాలో జమ కాకుండా
జమానుతులు పడి జుగల్బందీ ఆడుతారు…
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment