సోమరితనం
తేది : 10-11-2023
శీర్షిక : ప్రభుత్వ సంక్షేమం…
మందమతులకు పుట్టిల్లుగా
మననమెరుగని మేధస్సు ...
మతితప్పిన గతిమంతులకు
చిరునామాగా నిలిచేది..
మత్తుమందుల తోబుట్టువై
మనుషులనల్లుకునే మంత్రం ...
అక్కడక్కడా అప్పుడప్పుడు
మాత్రమే పొడసూపే తంత్రం...నాడు
కాని నేడది నిత్య పూజితం
ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్న
కొత్తరకం సంక్షేమాల సందడి…
మత్తు మందులా అలవడిందో
మడతేసుకోడానికి జమలుండవు…
ఉత్పాదకతల ఊసులెరుగని
స్వార్ధపు సంకెళ్ళ గొలుసులు ...
ప్రజాస్వామ్య మూలవిరాట్టులను
పడగొట్టి పడుకోబెట్టే యంత్రం ...
తోడుకున్నోనికి తోడుకున్నంత
సమయోచితం కావాలికదా ...
కాపలా విశ్వాసాలను కదిలించాలంటే
కూసింత కళాపోషణ ఉండొద్దా ఏం ?
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment