Saturday, June 22, 2024

లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ తేది : 01-01-2024 శీర్షిక : మనసంతా మాఘ పౌర్ణమి వెన్నెలలే ...

 లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ 

తేది : 01-01-2024
శీర్షిక : మనసంతా మాఘ పౌర్ణమి వెన్నెలలే ... 

నాకే ఎందుకిలా అని సంశయించకు 
పాలల్లో కనపడని నెయ్యిలా ... తెలియని 
కారణం ఎదో ఉందని గ్రహించు .... 
తెలుసుకుందుకు ప్రయత్నించు .... 

నల్లని మేఘాలని చూసి దిగులుపడకు 
చల్లని గాలిని పంపి చక్కని 
వర్షం కుమ్మరించి జీవరాశికి 
మానవాళికి దోహదమని గుర్తించు ... 

ఎదుటివారు మాట తూలారని 
బాధపడకు ... గురువింద గింజలా 
నీ గురించి నీకన్నా .... వారు నీ 
గురించి ఆలోచిస్తున్నారని గ్రహించు .... 

ముళ్ళుంటాయని  భయపడితే 
అందమైన గులాబీని కోయలేము 
సొంతం చేసుకోలేము ... పరిమళాలు 
ఆఘ్రాణించలేవు .... అనుభవించలేవు .... 

పనికిరాని రుణాత్మకతలను విసర్జిస్తూ 
ధనాత్మకతల దరిచేరి బంధువైయ్యావంటే  ... 
మనసంతా  మాఘ పౌర్ణమి వెన్నెలలే ... 
తనువంతా ధన్వంతరీ ప్రకాశములే .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment