Wednesday, June 19, 2024

కవన రవళి హైకూలు 14-12-23

 కవన రవళి 

హైకూలు 
 14-12-23 1.

మల్లె పందిరి 
మనసు విసిరింది 
ప్రేమ మూర్తిగా… 

 2.తెలిపెనులే 
వసంతాగమనము 
కోకిల కూతై… 

 3.మేఘం చిలికి 
అవని మురిసింది 
జలసిరితో… 

 4.సంద్రమునుండే 
సలిలం ఆవృతము 
వర్ష సందోహం 

 5.కొండాకోనలు
 కొసిరి మురిసెను 
మరకతమోలె… 

 నగునూరి రాజన్న.

No comments:

Post a Comment