నెట్టు లేనట్టయితే
07-02-24
శీర్షిక: వాయు సేతువు ...
పాలకుల ప్రగతిశీలమేమో
స్వేచ్చా విఫణికి తెరలుతీస్తే...
విజను కొరవడిన వింతలలో
పరిపాలనల వైఫల్యాల సమయాన
చదువులకు సరిపడే
కొలువుల
తాళం తీయక తటపటాయించిన వేళ …
పరాయితావులు వెదుక్కున్న
పిల్లలు
సీ ఈ వో లనుండి స్వీపర్ల వరకు
విశ్వమంతా విస్తరించిన నేపథ్యంలో
తీగలతో మాటకలిపి పరిమళాలు
పంచుకోడానికి ...
లేలేత
చివురులకు మాతృ భాషలో
తీపి పలుకులందించుకుని ఆనందాలు
పండించుకుంటున్న ఆత్మలకు…
పిందెలకు అండదండలయ్యే
కొండంత ఆశలకు గండిపడి
అడవికాచిన వెన్నెలలవ్వవా?
సంద్రములు దాట నాడు
శ్రీరామచంద్రుడు సేతువు
నిర్మిస్తే...నేడది గాలి మోటార్లతో
గడించినా...నిత్య సంభాషణలకు
నిజశోభలద్దుతూ వాయు బంధమై
వాంఛలు తీరగా కొంతమేర కృషి
అభినందనమేగా ....
క్షణాలమీద సమాచారమిచ్చి
పుచ్చుకునే తంత్రులు లేని
వింత సంత వాయు సేతువు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment