Saturday, June 22, 2024

కవన రవళి.. 16-01-2024 నానీలు

 కవన రవళి.. 

 16-01-2024 

నానీలు. 

 1. సూక్ష్మంలో మోక్షం 
యుద్ధనీతి కోడిపందెం… 
పతంగే జీవితం 
పరమార్థం బోధన…

 2.ఎవుసం ప్రధానం 
ఎద్దులే శ్వాసలు 
బసవల భంగిమ 
బహు సంబరం.. 

 3. రైతు పంటకు 
రారాజు ఎద్దులు.. 
సిరులు కురిపించి 
సిరి మువ్వై నవ్వింది ... 

 4. శ్రమకు పట్టం 
పశువుల పూజలు.. 
 సంస్కృతి సంప్రదాయం 
సమున్నతం… 

 5.పశువులే ప్రాణం
 పంటకు ఊపిరి… 
 అనాదిగా మనిషికి 
ఆది పూజనీయం…


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment