Sunday, June 16, 2024

పరిశుభ్రత తేది : 22-11-23 శీర్షిక : సంప్రదాయం

 పరిశుభ్రత 

తేది : 22-11-23
శీర్షిక : సంప్రదాయం

 ఇంటిలక్షణం పందిరి చెబుతుందని 
 ఇల్లాలిని చూస్తే ఇంటిల్లిపాదిని 
 చూడక్కరలేదంటూ .. నానుడిలతో 
 హైందవమెప్పుడో శ్రీమంతమైంది… 

మడి ఆచార మతలబులతో 
సంస్కృతి సంప్రదాయాల సదాచారంతో 
పంచభూతాలను పట్టినా ముట్టినా 
పబ్బతి  పట్టే మహోన్నతం మనదేశాన ...

ఆచారమంటేనే అంతెత్తునుంటారు
వ్యవహారమంటేనే వల్ల కాదంటారు
సాంప్రదాయమంటేనే సాకులు వెదుకుతారు
ఆద్యాత్మికమంటే..అంతా మిధ్యేనంటారు… 

ఎంగిలి మంగళములన్న ఏవగింపులెందుకయ్యా
హెపటైటిస్  బి  సశాస్త్రీయత రుజువులున్నవి కాదా
ఏ  ఆహారములైతే ఏమౌవుతుందిలే అనెదవేమో
ఎన్ కెఫెలిటీస్ బ్రెయిన్ ఫీవర్ వరాహ వరములే కాదా
బర్ద్ ఫ్లూలన్న మలిన కుక్కుటముల మరకలే కద సోదరా .... 

ఎదురులేదు నాకంటూ విర్ర వీగినందుకేమో
ఎదురైనది తిన్న ఫలితములేమో… 
ఎల్ల విశ్వము నేడు గొల్లుమనుచుండె
ఏకాకులను చేసి బంధాలను విడగొట్టి బావురుమంటూ…

ఏ క్షణాన పడమటింటి పాపపు కన్నుపడిందో... 
కాట కలిసిపోతున్న కంచి కథలలా .... 
ఒకటొకటిగా కదులుతున్న ఇటుకరాయిలా 
బీటలు వారుతున్న కోటగోడల ఆనవాళ్ళు .... 

ఒళ్ళైనా ఇల్లైనా శుభ్రతలాచరిస్తేనే సుందరం… 
నీతి నిజాయితీల నిలువెత్తు చిహ్నంలా 
నిలిచిన కొంతమందిలా…అందరూ 
అంతఃశుద్దిని కూడా ఆచరిస్తే మందిరం… 

మన శుభ్రతలను గాలికొదిలేసి 
మడతపేచీలాంటి డియోడరెంట్లను 
అద్దెకు తెచ్చుకున్నంత మాత్రాన… 
శుభ్రతల ఉత్తీర్ణతలు పొందినట్టు కాదు…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment