సంస్థాగత గేయాలు
తేది 09-12-2023
శీర్షిక : నేటి కవిత
ఉదయ సాహితీ నేటి కవిత
విశ్వ సాహితీ జగత్తంతా
విలువలతో మెరియంగా…
తెలుగు కవన పూదోటగ
తెరిచిందొక విరజాజుల మూట…
సామాజిక ఐక్యతలతో
సమసమాజ భారతిగా
వేదికయై వెలసె మేటిగా
నేటికవిత సమూహం…
విశ్వ సాహితీ జగత్తంతా
విలువలతో మెరియంగా…
శారదమ్మ శిఖలోన
సౌరభమై మురిపంగా
శ్రీదాస్యం జోడిలతో
సిరులెన్నో మూటగట్టె…
సుప్రభాత రవి కిరణం
సుమవనాల ఉదయసాహితి
తెలుగునేల నలుచెరగుల
వెలుగు పంచు దివిటీలు
విశ్వ సాహితీ జగత్తంతా
విలువలతో మెరియంగా…
వచన కవిత వరుసలతో
దరహాసం విరబూయగ…
వారవార ఫలితమ్ముల
వరములిచ్చు ప్రోత్సాహం …
మనలో మనమై సాగుతూ
మెరుగుదిద్దు సాహిత్యం…
నవీనతల నైపుణ్యం
కలబోతల వైవిధ్యం …
విశ్వ సాహితీ జగత్తంతా
విలువలతో మెరియంగా…
పరాయిదైన గజలును
పవింత్రంగ కొలుస్తూనే..
కలంగళం గేయముల
కలబోయు సంతసాలు …
చిత్రకవిత విరజాజులు
చిద్విలాస పరిమళాలు…
దృశ్య శ్రవణ ఆలాపన
అత్యుత్తమ సాహిత్యం…
విశ్వ సాహితీ జగత్తంతా
విలువలతో మెరియంగా…
పంచమ వత్సరమున
పదిలంగా నిర్వహించే …
అనురాగం పంచుకొనగ
ఆత్మీయ సమ్మేళనం…
మనకుమనంకాకుండా
పరులమేలు కోరుటకు
ఉందిలే ఉన్నత మార్గం
నాకునచ్చిన సాహిత్యం…
విశ్వ సాహితీ జగత్తంతా
విలువలతో మెరియంగా…
తెలుగు కవన పూదోటగ
తెరిచిందొక విరజాజుల మూట…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment