పండుగలు వైశిష్టం
తేది 18-11-3023
శీర్షిక : కాలమార్పుల కాయం వృద్ది.
మునులు ఋషులనుగన్న
పుణ్యభూమి మన భారతం..
మానవాళి జీవన సరళికి
మనుగడే కాలమానమని గుర్తించే...
ఆయనములు మార్చుకుని
అరుదెంచే భానుడు ప్రకృతిలో
వాయనములు తెచ్చు మనకు
ఋుతువులు కాలాలు కానుకగా…
కాలముతో కాటకలిస్తేనే కాయములో
జరిగే సూక్ష్మ
మార్పులను సున్నితంగా
ఒడిసిపట్టి మన్నికగా
కదంబపరిచారు…
కాల మాన పరిస్థితులకు అనుగుణంగా
కథలు పూజలు
పండుగలు పబ్బాలు...
శిశిరంలో తరువమ్మలు మోడువారినా
వసంతంలో చిగురిస్తూ …వనమంతా
విచ్చుకుని పచ్చలు పొదువుకును
పుచ్చపువ్వులా నవ్వుతుంది…..
మట్టితో వినాయకుణ్ణి చేసి
పత్రితో పూజించి
నిమజ్జనం చేసినా ...
నవరాత్రులు
సుందరమైన పూలతో
కొలిచి.. గౌరమ్మను
తంగెళ్లతో తరలించి
కొత్తనీళ్లలో వేసినా ...
కాలానుగుణమైన కాయగూరలు
పూలు పండ్లు ఫలాలతో ఫరిడవిల్లే
అవనిమాత…అవి తిని వృద్ది చెందే
మానవాళి జీవరాశి…. నిబిడీకృత
సూత్రాలను గుర్తించి భద్రపరిచారు ఆరోగ్యసూత్రాలు…
సూక్ష్మంలో మోక్షమయే పాత్ర…
పండగలలో విశిష్టమై పాటించే
మడి ఆచారాల మతలబులు…
శుచి శుభ్రతల సుంగారమైతేనేమి…
తిండి తిప్పళ్ళ విధానమైతేనేమి…
అన్నీ వెరసి మనకు ఆరోగ్యసూత్రాలే…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment