Wednesday, June 19, 2024

ఐదేళ్ళ ఎంపిక 30-11-2023 శీర్షిక : అసలైన మురిపం

 ఐదేళ్ళ ఎంపిక

30-11-2023
శీర్షిక : అసలైన మురిపం 

రూపాయి రూపాయి మాట్లాడవా
అంటే … నూరయేదాకా నీవంతు 
నూరయ్యాక ఇక నావంతు 
అందట పైకం ఆసామితో…. 

పేజీలకొద్దీ రాసుకున్న రాజ్యాంగం 
పెత్తందార్లకు మాత్రమే కలసొచ్చింది..
పెద్దా చిన్నా కచేరీలిచ్చింది...
పేదోనికి ఎన్నికల్లో నిలబడే అవకాశమే 
మృగ్యమాయె… 

ప్రజాస్వామ్య పీఠానికి పటుతరమై
పట్టు ఇవ్వాల్సిన నాలుగు పాదాలు 
నత్తనడకలతో చిత్తవుతూ 
స్వార్థాల సవారీ చేస్తున్నాయి... 

 సంతలో వింతలా సంవత్సరాలు 
 గడిచిపోతుంటే సనుగుళ్ళు కూడా 
వినిపించలేక సాగిలపడిపోయి
సర్దుకుని బ్రతకడమే సగటు మనిషి… 

అర్ద శతాబ్ది దాటిపోయినా 
 అందమైన అక్షరాల మాట 
 అభివృద్ధిచెందుతున్నదంటూ…. 
 అంతర్జాతీయంలో ఎదురుచూపులు... 

అసలైన ఐదేండ్ల ఎంపిక 
 అక్షర సత్యం కావాలంటే 
 మూలలను సవరించక 
 మురిపాలు తీరాలంటే ఎలా ? 

 నగునూరి రాజన్న

No comments:

Post a Comment