Saturday, June 22, 2024

నిద్ర తేది -06-01-2024 శీర్షిక : పునఃశ్రీకారానికి పుణ్యమూర్తి.

 నిద్ర 

తేది -06-01-2024 
శీర్షిక : పునఃశ్రీకారానికి పుణ్యమూర్తి.  


ఆవురావురుమనే ఆకలి కాక
గొంతెండిపోయే దూపల దీపం
కాయకష్టాల చెమటోడ్చుళ్ళు
రోజటి వెలుగులలో రోషించేవే ... 

సాధారణంగా చీకటిని వెంటేసుకునే
నిద్రమ్మ మాత్రం… అప్పుడప్పుడు
చీకటి వెలుగులైనా తేడాలేదనే 
శ్వాసల ఊసుల జాడలు .... 
 
రోజంతా శ్రమశీలతలకు చిక్కి శల్యమైన 
తనువులు అలసిపోతే తగులుకునే 
రాత్రి నిద్రమ్మ మాత్రం  పునః శ్రీకారాలకు  
పుణ్యమూర్తిలా టానిక్కై పోతుంది ..... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment