Saturday, June 22, 2024

జాతీయ బాలికా దినోత్సవం తేది 24-01-24 శీర్షిక : లక్ష్మీ కళ

 జాతీయ బాలికా దినోత్సవం

తేది 24-01-24
శీర్షిక : లక్ష్మీ కళ 

అజ్ఞానాల నీడలలో తచ్చాడుతూ 
అవగాహనలోపాలు అందిపుచ్చుకుని 
అపరిపక్వతలు వారసత్వమైతే 
అన్నీ అపశకునాలే...బారాల బాధ్యతలే ... 

ఉన్నవాడిని నకలు కొడితే 
లేనోడికి బొక్కలు చూర చూరనే ... 
అందని అందలాలు అందుకుందామని 
బొక్క బోర్లా పడిన దాఖలాలే .... 

డెబ్బయిలలో దెబ్బ కొట్టిన 
స్కానింగులు... చాపకింద 
నీరులా ప్రభుత్వాలు పంచి 
పెట్టిన పథకాలు ... ముందు 
చూపు లేని విధానాలు ... వెరసి 
పగబట్టిన వైనం .... 

నేటికీ ఆడపిల్లంటే .... ఆడ ...
పిల్లనే...అపవాదు.. అంధకారపు 
నమ్మకాలు ...వమ్ము చేస్తున్న 
వైనాలు ... ఇకనైనా మారాలి ... 

సంస్కృతి నేర్పిన సారం ... 
సంబోధనలో ముందున్నట్టే 
సర్దుబాట్లలో ముందుండాలి ... 
ఇల్లిల్లు లక్ష్మీ కళ  సంతరించుకోదా ... 

ఒక్కరోజు రాజులా కాకుండా 
ఎల్లకాలం మహారాణిలా 
అందరమూ ప్రతిన బూనుదాం 
పరిస్థితులను కల్పిద్దాం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment