కాలంతో కరచాలనం
తేది : 21-11-2023
శీర్షిక : స్థితప్రజ్ఞతల స్థిరచిత్తం
కాలమెప్పుడైనా శాశ్వతమే…
కాలప్రవాహంలో మనము
కలిసి పయనించడమే సౌకర్యం…
చేప నీటికెదురీదిన చందంగా
కాలానికి ఎదురీదాలనుకోవడం
జయించాలనుకోవడం మూర్ఖత్వానికి చిహ్నం…
ఆడ మగల ఆంతర్యము
రాజు పేదల బేధమెరుగని
మరమనిషిలా… కరుణ దయ జాలి కాఠిన్యం కనికరం
ప్రేమ కోపం
ద్వేషం ఈర్ష్య మోహం లోభం... లాంటి
రాగద్వేషాల రంది లేని స్థితప్రజ్ఞతల
స్థిరచిత్తాల కాలమహిమలను మనిషి నాడే గుర్తించాడు...
రంగు రుచి వాసనలు లేకుండానే..
కంటికి కనపడకుండానే కారిపోయే
కాలప్రవాహానికి అనుగుణంగా ఎంతటి
కఠినాలనైనా ఎదుర్కొంటూనే
తాను
కదలడం నేర్చుకుని సౌకర్యాల బాటపట్టాడు…
శాశ్వతమనుకుంటున్న సౌరకుటుంబం
గ్రహకూటములు పాలపుంతలు
కూడా కొన్ని కొన్ని సందర్భాలలో
శిథిలమవచ్చు మార్పుచెందొచ్చు ...
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే
కొడుకు తారసిల్లినట్టు ...
కరచాలనముతో కలిపినిలిపే
పనులకు శ్రీకారం చుట్టాలి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment