Wednesday, June 19, 2024

ప్లాస్టిక్కు. తేది : 13-12-23 శీర్షిక : ఉభయచరమాయె

 ప్లాస్టిక్కు.

తేది : 13-12-23
శీర్షిక : ఉభయచరమాయె

అందమైన సుందరంలా
అన్నింటా అమిరిపోతూ
సర్వంతర్యామిగా అంతటా 
వ్యాపించింది..గల్లీ నుండి డిల్లీ వరకు

వామనునిలా ప్రవేశించి
బలిని బలి కోరుకున్నట్లుగా … 
వటుడింతై జీవరాశినే కబళించాలని
ఉవ్విళ్ళూరుతున్నది… 

పరిచయించ అక్కరలేని  
వింతనిండిన ముంతమామిడి 
పాలిథీన్లతో నిండిపోయెను 
వాగూవంకలు వనములెల్లను. 

మనుషుల  అలసత్వాలతో 
మలె పడుతున్న పాలిథీన్లు 
రైలుకు రోడుకిరువైపులా పరిచి.. 
కాలవలలలో కంపుకు మూలమై 
వాగుల్లో వంకల్లో చిక్కి… నదులలోకి
నడిచి..సముద్రాలు చేరిపోయె… 

పశువులకు ప్రాణ సంకటమై
పల్లెకు పట్టణాలకు చుట్టు కంచెలాయె … 
వాయు కలుషితాలకు మూలమై 
జల కలుషితాలకు తావాయె… 

అందు గలదు ఇందు లేదను 
సందేహమే లేదు.. ఎందెందు 
వెదికినా అందందే గలదు… 
చూపులతో కట్టిపడేస్తూ సూక్షములై 
ప్రవేశించి విశ్వమంత విస్తరించె… 

అది ఇది అనే తేడా లేకుండా అన్నింటా నిలిచి   
పచ్చని సంసారాలలో నిప్పులు కుమ్మరిస్తుంది... 
భూమిని నీటిని ఆక్రమించి ఉభయచరమై
మానవాళి ఉనికికే మచ్చగా నిలిచింది....ప్లాస్టిక్ 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment