Sunday, June 16, 2024

ఒంటరి సమయాలు 2. తేది : 20-11-23 శీర్షిక : మార్పు…

 ఒంటరి సమయాలు 2.

తేది : 20-11-23
శీర్షిక : మార్పు… 

రాతిగుహలలో కూడా రంజిల్లె
రమ్యముగా గుంపులు గుంపులుగా… 
రారాజుగా దర్పముతో బ్రతుక నేర్చె 
అవిభాజ్యముల ఆనందాలతో నాడు… 

పారిశ్రామికీకతల పరుగుపందెం 
మేమిద్దరం మాకిద్దరనే ముద్రవేస్తే… 
సాంకేతికతల సద్దిముల్లె నెత్తికెత్తుకుని 
ఆడైనా మగైనా ఒకరే ముద్దన్నాము… 

ఇంటింట దూరవాణి దూరగానే 
చావళ్ళు అరుగులన్నీ బోసిపోయాయి… 
చరవాణి చేతికి చిక్కగానే బిక్కచచ్చిన మనిషి 
తెరలవాణి గూగులమ్మ వాకిటనే నిల్చిపోయాడు… 

నెట్టు సాలెగూటి ప్రపంచంలో చిత్తయ్యాక 
ఓటీటిలతో ముచ్చటిస్తూ… ఇంట్లో మనుషులకు 
కూడా దూరంగా జరుగుతూ..   ఒంటరి
సమయాలతో ఓదార్చుకుంటున్నాడు… 

కన్నవారికి కట్టుకున్న వారికి కన్న పిల్లలకు 
సైతం లెక్కలేసుకుంటున్న మాటామంతి…
కష్ట సుఖాలు పంచుకోడానికి… కడుపార 
నాలుగు ముచ్చట్లు మాట్లాడుకోవడానికి 
కాసులిచ్చి మనుషులను 
పురమాయించుకునే పుణ్యకాలంలో  
పయనిస్తున్నాము. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment