Saturday, June 15, 2024

అనుభవాల ఆటుపోట్లు తేది 15-11-23 శీర్షిక : ఆభరణాలే….

 అనుభవాల ఆటుపోట్లు 

 తేది 15-11-23 

శీర్షిక : ఆభరణాలే…. 

 కానరాని భవిష్యత్తులో 
 కారడివే జీవన పయనం ... 
 ముళ్ళు రాళ్లతో ముప్పుతిప్పలే 
 పిల్లతోవలో రాచబాటలో ... 

 జీవనం ఓ సంద్రమైతే 
 అడుగడుగున ఆటుపోట్లే .... 
 అనుభవాలను ప్రోదిచేసుకుంటూ 
 అణకువగా సాగిపోవడమే ... 

 ఆనంద నందనాలకు పొంగక 
 దుఃఖ సాగరాలకు లొంగక 
 స్థితప్రజ్ఞతలతో చిరాయువై 
 కాలం జాడలలో కదిలిపోవడమే ...

 అనుభాలన్నీ ఆభరణాలే 
 విజయాలు వెన్నుతడతుంటే 
 అపజయాలు విశ్లేషించుకుంటూ 
 అన్నింటిని ఆహ్వానిస్తూ సాగిపోవడమే ... 

 కాలం పాములా కాటేస్తుంటే 
 చేతికర్రనే చక్రాయుధమైతుంది... 
 అందుబాటైన ఆసరాలన్నీ 
 ఆయుధాలకంటే బలంగా తోస్తాయి... 

 నగునూరి రాజన్న 

No comments:

Post a Comment