Saturday, June 22, 2024

ఆ పిలుపు కోసం తేది 21-12-2023 శీర్షిక : ఐక్యమాయె ఆ రంగనిలో…

 ఆ పిలుపు కోసం 

తేది 21-12-2023
శీర్షిక : ఐక్యమాయె ఆ రంగనిలో… 

 విల్లిపుత్తూరు విలాసముగా 
 విరచెను ఒక ప్రియభక్తుడు 
 చిత్తము విష్ణువుపై నుంచ 
 విష్ణు చిత్తుడిగా వినుతికెక్కే .. 

తులసీవనమున పాప దొరికి 
పూలమాలగ భావమందే 
కోదై పేర నామమందగా 
మారె తదుపరి గోదాదేవిగా ..

బాల్యమునుండే బలముగా విన్న 
కృష్ణలీలకు తృష్ణ పెంచుకొనగ ... 
కాలగతిలో భక్తి మీరి ప్రేమగ మారె
కనులు మూసినా తెరిచినా నల్లనయ్యే… 

సోపతులంతా  గోపికలని పుత్తూరే 
రేపల్లెయని లీనమైన చిక్కని భావనల 
మాలలన్ని ముందు తాను ధరిస్తూ.. 
పంప సాగే ఇంపుగాను రంగనికి నిత్యం ... 

కాంచిన తండ్రి మనమున 
చింత మొదలై వంచితముగా 
నెంచి బాధనొందగా.. కలను గనెను
రంగడూరడించ రమ్యముగా… 

ఇనుమడించిన ప్రేమ నీడన
కాత్యాయనీ వ్రతమాచరిస్తూ
కొలువనెంచె ఆ కొంటె రంగన్ని 
కమ్మని పాశురముల తోడ కడు ప్రేమగా … 

కొదువలేని ప్రేమపూరిత గోదమ్మకు 
లొంగక తప్పని కొంటె కృష్ణుడు ...
చెప్పెనంత విష్ణుచిత్తునకు తోడి తెమ్మని
శ్రీరంగమునకు తోరమై వివాహమునకు ... 

వేచెనంత ప్రేమ పూర్వకమైన పిలుపుకోసం 
వేగెనంత అలౌకికమైన ఐక్యరూపతకై
రంగనిలో… కారణ జన్మం తనదని కాచి 
వడబోసిన కమ్మని మర్మం బోధిస్తూనే…

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment