Wednesday, June 12, 2024

చీమ తేది .19-10-23 శీర్షిక : కష్టజీవి

 చీమ 

 తేది .19-10-23 
శీర్షిక : కష్టజీవి 

ఎవరైనా చూస్తే రోజంతా ప్రయాణమే 
జీవితమంతా శ్రమించడమే… ఏంటో
అనుకుంటాము. కాని లోతుగా 
అధ్యయనం చేస్తే అవాక్కే మనుషులు… 

 క్రమశిక్షణల కవాతు ప్రాణం 
 కష్టపడుటే వాటి మనస్తత్వం... 
 పొదుపుకు సదా సంకేతం 
 సామూహికమే సంఘటిత బలం...

ఇంజనీరింగులో ఇగురశాలి 
అందమైన గదులతో అలరారు
గృహాలు…. 
పాముల కథలో గృహ దాతలైనా 
పావురం కథలో హీరోగా నిలిచింది… 

పన్నెండు వేల రకాలతో శాఖోప 
శాఖలై పరిఢవిల్లిన వంశ వృక్షం… 
రెట్టింపు బరువు మోసుకొని పోయే
మోతబరువులో బలశాలి తాను … 

సూర్యదిశలను సుందరమై గుర్తెరిగి 
రసాయన చర్యలతో రాచబాటలు 
వేసుకుని… సంభాషించుకొనును 
ఆపద సంపదలకు ఆరాటపడుతూ… 

విషనాగులనైన వింతగ చంపును
విధి సహకారముతో విలువలు తెలిసి
సామూహికమైన కదలికలు… సంఘటితమే
పటిష్ట భద్రత… సదా ఉదహరించుకోగలిగే ప్రాణి … 

నగునూరి రాజన్న. 

No comments:

Post a Comment