జానపదం.
తేది: 25-11-23
శీర్షిక : ఏయ్ ఓటరూ బాగున్నావా
ఏయ్ ఓటరూ బాగున్నావా
ఛాయ బిస్కెట్టులే నీకున్నాయా
ఎన్నాళ్లిలా ఉండిపోతావోయీ
ఎన్నేల్లిలా భరిస్తుంటావోయి ...
ఏయ్ ఓటరూ బాగున్నావా !
నీ రెక్కకల కష్టం తొనే కదా
ప్రజాస్వామ్యము పరిఢవిల్లేది
గుర్తించావా ఎపుడైనా
గురిచూసి లెక్కలన్నీ ...
ఏయ్ ఓటరూ బాగున్నావా !
కుప్పమీద తెప్పలాటలా
రెప్పపాటు సమయంలోనే
ఉప్పుమిరపకాయలకే
చిప్ప చేతికి అందిస్తున్నారు ...
ఏయ్ ఓటరూ బాగున్నావా !
వేల రూపాయలు పంచుతున్నారంటే
కొట్లమీదనే వారి చూపులన్నీ
అమ్ముడుపోకురా తమ్ముడూ
తప్పుడు తోవల నాయకులకూ
ఏయ్ ఓటరూ బాగున్నావా !
మత్తులోన మునిగిపోకురా
గమ్మత్తుందని మురిసిపోకురా
స్వచ్ఛమైన నీ ఓటే ఆయుధం
సదా రక్షించు పాశుపతాస్త్రం ..,
ఏయ్ ఓటరూ బాగున్నావా !
No comments:
Post a Comment