హృదయ స్పందన
తేది : 05-12-2023
శీర్షిక : మట్టి సువాసనల తరంగం
సహస్రాధికం
కనులు మూసినా తెరిచినా
మరుపురాని మనో నేత్రం తెరుచుకుని
కనపడని కవ్వంతో చిలికి కమ్మని వెన్నను
జనింపజేసి మానవీయపు విలువలనద్దే
మహత్వపు మట్టి సువాసనల తరంగం…
ప్రకృతిలో ఒడిలో పల్లవించే పదనిసలను
పట్టుబట్టల్లో పదిలపరచడమే కాకుండా…
కాలగమనంలో గమకములై కదిలే
కథా కమామీషులను కళ్ళకు కట్టినట్టుగా
కదం తొక్కించగల ప్రకంపనం ....
అలుముకున్న తెర తెల్లనిదయినా
ఎప్పటికప్పుడు నూతనత్వాలను
ఎప్పటికప్పుడు నూతనత్వాలను
పులుముకుని..శోభలను సంతరించుకుంటూ
రంజింపజేయు నిత్య సప్తవర్ణాలతో .....
రంజింపజేయు నిత్య సప్తవర్ణాలతో .....
మరిచిన భవ బంధాలతో..రాగ ద్వేషాలతో
కుప్పలు తెప్పలయ్యే భావరాశుల
గుంభనపు పద పొందికల మాలలతో
సొగసు వాక్యాల సుగంధభరితమే…
ఆత్మ సాక్షిని ఆసరాగా చేసుకుని
పాలకుల పనితనాలను ఎండగడుతూ…
అణగారిన జనాలకు అడ్డుగా నిలిచిన
అణగారిన జనాలకు అడ్డుగా నిలిచిన
అన్యాయాలను ప్రశ్నించడమే కాదు...
అప్పుడప్పుడు నిగ్గదీసే నిప్పురవ్వలను
సైతం ప్రజ్వలింపజేస్తుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment