కవన రవళి
నానీలు
12-12-23
1. కళ్ళుచెదిరే
కళాత్మకం..
శత్రు దుర్భేద్యం
గిజిగాని
పొదరిల్లు
.
2. భాష తెలియని
భావయుక్తం...
రాగమెరుగని
సంగీతం.. పిట్ట గూడు
3.
మధురగాన
కువకువల
సదనం...
.
పిచ్చుక గూడు
4. చిటారు కొమ్మల్లో
చిరునవ్వుల పొట్లం...
గమ్మత్తులు కుమ్మరించే
గిజిగానిల్లు..
5. కంచే చేను
మేసే వంచనలు..
తీరైన మోసాల
తిరునాళ్ళు..మనిషి.
6.ఉచిత తాయిలం
ప్రజా మత్తు..
పన్ను పోటుతో
మధ్య తరగతి చిత్తు…
7.పల్లెవెలుగులో
తెలంగాణ తల్లి…
విద్య వైద్యం
అందని ద్రాక్షలు…
8.సాధికారత
వివక్షల దూరం…
సంధి కాలం
క్షమతకు నెలవు…
9. పోటాపోటీగా
ఉచితాల సంత..
చిచ్చులతో
ప్రజానీక
తంపులు…
10.ప్రకృతిచ్చే
వరాలను కాముక
ప్రజాక్షేమాలకు
ఖరారు చేయాలి…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment