శ్రీపదాలు సెప్టెంబర్ 2023
శ్రీపదాలు
1. గుణంచేత గణనాథుడివై గెలిచావు.
అమ్మచేతిలో బొమ్మవు అయినా…
ఆదిదంపతులే అమ్మనాన్నలుగా కలిగున్నా…
19-09-2023
శ్రీపదాలు
2. హిందువులకు సింధువైన గణపతి.
తిలకుడానాడు తీర్థము పోయగా…
తీగలాగా అల్లుకుని దేశమంతా…
19-09-23
శ్రీపదాలు

3. అధికారమైనా.. ప్రతిపక్షమైనా…
అకుంఠితత్వమే.
మాటకు కట్టుబడి ఒట్టుపెట్టుకుని…
అక్షరబీజాలకు లక్షలమందిని దూరముచేస్తూ…
19-09-23
శ్రీపదాలు

1. పొరుగులు హద్దుమీరితే లెక్కలేసుకున్నాము.
పాలకుల పనితీరుకు దర్పణంగా..
తీరుమారగానే పద్దతిమారి నిశ్శబ్దమైనది….
20-09-23.
శ్రీపదాలు
2. పిల్లి సైతం పులవుతుంది.
హద్దుమీరి సహనాన్ని పరీక్షిస్తే…
గదిలో బంధించి బాధిస్తే …
20-09-23
శ్రీపదాలు

3. అధికారదాహం హద్దుమీరితే అరాచకమే.
అదేదో గుత్తాధిపత్యంలా మారుతూ…
వాళ్ళుమాత్రమే పాలనలు చేయగలరన్నట్టుగా…
21-09-23
నగునూరి రాజన్న
No comments:
Post a Comment