భ్రూణ హత్యలు
తేది : 18-11-23
శీర్షిక : మూలాలు.
ఉప్పుడు బియ్యపు తప్పుడు లెక్కల్లా
చెప్పుడు మాటల చేటులె సుమా ...
అవగాహనా లోపపు ఆంతర్యంతో
మెదడు మోకాలిలో చేరిన కూపస్థ
మండూకాలు...
ఆడపిల్లలంటేనే ఆదిలక్ష్ములని
పొగడ్తల దండలు వేసేవారు అందరు...
బిడ్డలెక్కువ మంది ఉంటేనే
భాగ్యశాలి అనేవారొకనాడు ...
వ్యవసాయాధిరిత బడుగు బలహీనుల్ని
పారిశ్రామికీకతలవైపు నడిపించి
ఆర్థికాంశాల బలహీనతలు చూపించి
అడుగులేయించారు చాపకింద నీరులా ...
ఆంటీ ముట్టని సంసారాలతో
ఆగమాగం కావోద్దంటూనే
మేమిద్దరం మాకిద్దరంటూ కొంత
పాలకులు కూడా పక్షపాతించారు ...
ఎదుగూబొదుగుల సాకులు జూపి
బుజ్జగించి బుదురగించి ఒక్కరిద్దరికే
ముద్దుగా కుటుంబ నియంత్రనలతో
కుంటు పడేశారు కుత్సితంబుగా ....
ఆడపిల్లలంటే మైనస్సులని..
ఎప్పుడైనా ఓ అయ్యింటికి వెళ్ళేదేనని…
అనవసర ఖర్చుల పద్దని.. పుకార్లు
షికార్లు
చేయించి అంకురం వేయించారు.. రంకుతనంతో ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment