చెత్త బండి
శీర్షిక : ఆరోగ్య రథం
తేది. 03/04-01-24
ప్రకృతిలో పుట్టి పెరుగుతున్న
ఏ జీవరాశికి ఎరుక లేనిది …
మిన్నంటూ విర్రవీగే మనిషిని
మాత్రమే అంటిపెట్టుకున్నది…
మానవాళి ప్రమేయమున్నంత మేర
మలినముల కుప్పల తిప్పలు ...
పల్లెల నగరముల చుట్టూరా పహారా…
వాగువంకల్లో నిండిపోతున్న కోటలు…
జీవరాశికాంతకు పొంచి ఉన్న ముప్పు
ఎప్పుడు తప్పునో ఈ మురికి తిప్పలు ...
మన దుర్గంధం తాను భరిస్తూ…
తన జీవితమే పరుల సేవకంటూ
తరువులా
పరులకు సేవలందిస్తూ
తరించే సద్గుణరాశి త్యాగమయి...
మనందరివలన ఏర్పడుతున్న
చెత్తను శుభ్రపరుస్తున్న వాహనం…
నిజానికది ఆరోగ్యమందించే రథం
భాషకందని తికమకల భావపరిమళం…
స్వార్థ చింతనల మంకెన పూవు
డాంబికా పటాటోపాల ప్రతినిధి
మొత్తంగా మానవాళి పెంచి
పోషిస్తున్న రాకాసి కొండలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment