ఆణి ముత్యాలు
తేది: 05-01-2024
శీర్షిక : పద విన్యాసము
తేట తేట తీపి పలుకులు
పొదుపరి గుణాల మాటలు
ఉల్లేఖనల ఉదాహరణలు…
పొందు కోరు క్షేమము
రస సమాహారమై కర్ణ మనోహరమై…
వందలేండ్లు కాచిన వడబోతలు
యుగాలు దాటినా జగాన తేజం
చంపపెట్టుగా చెల్లుబాటయ్యే
చిన్ని మాటల చిలిపి మూటలు…
అనుభవాల రంగరింపు
అంతరంగ చోద్యము
ఆదరించే పదబంధము
అత్యల్ప పదాల అనంతార్ధం
ముచ్చటగా ముదము గొల్పు
సిరి మువ్వలహారము
మనోల్లాసమయే మహా కావ్యము
మహామహుల పదవిన్యాసము…
యతి ప్రాసల పద వినోదము
అలంకారాల చమత్కారము
పోలికల రాజసాల పొలికేక
మాలికలయ్యే మాటలపూదోట…
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment