అనురాగ సరాగాలు
తేది : 25-01-2024
శీర్షిక : పాల సంద్రమే ...
ఆత్మీయతలకు తోబుట్టువు
అమ్మ పదానికి అసలైన అర్థం ...
తోబుట్టువులలో తొణికిసలాడి
మిత్రులతో మిళితమయ్యేది ...
జీవరాశిలో ప్రస్ఫుటమయ్యే
మానవత్వాల మచ్చుతునక ...
ఓ వైపు నుండి చిగురించగనే
పచ్చని వనమై విస్తరిస్తుంది ...
ఇచ్చి పుచ్చుకుంటూ పోతే
ఇగురించిన మల్లె తీగలా
వ్యాపించి గుండు మల్లెల
గుభాళింపులు వ్యాపించు ...
గొలుసుకట్టులా నలుగురు పూనుకుంటే
మమతల పూలు పరిమళించి
మురిపాలను వెదజల్లుతూ
పంటచేలై దిగుబడులిస్తుంది ....
బాల్యమైనా భవితనిస్తుంది
యవ్వనమైనా జీవితమిస్తుంది
ముదిమియైనా మురిపమిస్తుంది ...
జీవితమంతా దొరికితే పాలసంద్రమే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment