Sunday, June 16, 2024

పున్నమి రాత్రి తేదీ : 24 -11 -2023 శీర్షిక : వెలుగు పూల పందిరి

 పున్నమి రాత్రి 

తేదీ : 24 -11 -2023 
శీర్షిక : వెలుగు పూల పందిరి

 చీకటి వెలుగుల సమ్మిళితం 
విశ్వ భూ భ్రమణాల పరిణామం 
పండు వెన్నెల్లు పంచు కాలం
ప్రకృతిసిద్ద పరమానందాల నిలయం… 

 కాల గణన చక్రంలో
కనుల పండుగై హాయి గొలుపు
పౌర్ణములన్నీ ప్రశంసమే 
అయినా సంధికాలపు సంక్రమణాలు 
సర్వశ్రేష్ఠం. (చైత్ర,ఆషాడ,కార్తీక మరియు మాఘ )

 సంప్రాప్తించిన సగటు నిశిలో సైతం 
సగవెలుగులు సన్నుతిగా పంచి
సద్భావన సమ్మోహనాలకు నాందియైనది
సంద్రమంత వెలుగులు విరజిమ్ముతూ..... 

 మానవ అజ్ఞానం మసకబారిన అమావాస్యయితే 
మస్తిష్క చైతన్య దీపికే మచ్చలేని పౌర్ణమి 
కష్టాలను ఈదే కడగండ్లు నిశి చీకట్లౌతే 
సుఖసంపదల సమాహారమే పౌర్ణమి... 

 వెలుగుపూల పందిరి కింద 
సంద్రములుప్పొంగి సంబరాలు 
పంచుతుంటే పిల్లా పెద్దలకు 
 మది సంతోషాల సందళ్ళే… 

 నగునూరి రాజన్న 

No comments:

Post a Comment