చిత్ర కవిత.
తేది : 09-12-2023
శీర్షిక : అమ్మల దేవాలయం.
అమ్మలందరి దేవాలయం
ఆత్మీయతలు పంచే ప్రేమాలయం
పిన్నలకు పెద్దలకు బేధమెరుగక
అందరికి ఆకలితీర్చే పాకాలయం…
సంస్కృతికి నిలువెత్తు నిలయం
సంప్రదాయాల నిండు సదనం
సంపదలన్నింటి మూల కారకం
ఆచారాల నిండిన ఆరాటం …
శుచి శుభ్రతల పొంగే ఆలవాలం
మడి ఆచారాల దైవ గోపురం
మణిరత్నఖచిత సంపదల భాండాగారం
మనందరికి పూజనీయ పవిత్రం…
ఉదయాత్పూర్వమే ఉరుకులు
పరుగులతో అమ్మ శ్వాసలతో
ఘుమఘుమలు వెదజల్లుతూ
మమతలతో నిండిన శిఖరం …
చిన్ని బొజ్జలు తాను నింపంగ
చిద్విలాసాల సంతృప్తులే…
అందరి ఆకలి దప్పులు తీర్చుతూ
అమ్మ అందుకునే విజయపరంపరలే…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment