సరి కొత్త ఆశలు
తేది : 01-01-2024
శీర్షిక : మంచినీటి చలమ.
పురపాలక శాఖ ట్యాంకులో నీటిని
ఊరంతా ఖాళీ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ
నింపినట్టు... ఊరుతూనే ఉంటాయి
కొత్త కొత్త ఆశలు ... ఆశయాలు…..
ఉన్నప్పుడు ఉగాదిలా ఉబ్బిపోయి
లేనప్పుడు శివరాత్రిలా దివాలా కాకుండా
ఎప్పుడూ ఒకేలా ఉండేవిధం…
సుమసుందరమై బహుసుందరమై ...
ప్రశాంతమైన మదిసంద్రంలో
అంకురించే కలల అలలెన్నో …
కడదాకా కదిలి కదిలి దరిచేరేవేన్నో ..
కాదని కడలిలోనే మాయమయేవెన్నో ..
అణువే అండమని పిండమని
బ్రహ్మాండమని బహుబాగా గుర్తించాలి
అంతా నేనేనని భ్రమలు వీడి
బతుకు నావను నడిపించగలగాలి…
ఆశల ఉనికికి అంతం ఉండదు…
మంచినీటి చలిమలా చకచక ఊరుతుంటాయి…
భరోసాలు నింపుతూ అడుగేయడం
నేర్చుకోవాలి… పంచుతూ పోవాలి…
స్వార్థం తలకెక్కించుకుని
ఉన్నదంతా నాకేనని.. ఊరిస్తూ
మలె వేసుకుంటూపోతే… మడత
పడిపోయి..కొత్త చిగురులు కానరాక
చివరకు మోడయి మిగులుతుంది…
No comments:
Post a Comment