Saturday, June 15, 2024

వాణిజ్య ప్రకటనలు. 15-12-2023 శీర్షిక: దండోరా…

 వాణిజ్య ప్రకటనలు.

15-12-2023
శీర్షిక: దండోరా… 


వినుడి వినుడి జనులారా 
ఘనుడి మాట నాదంటూ… 

విన్నవాళ్లు విననివాళ్ళు
వినండంటూ కేకేస్తూ… 
కళ్ళకు గంతలు కట్టేటి
వింతగళ్ల సంతమాట… 

వస్తువుల గుణశీలత 
 వరుసబెట్టి జెప్పడమే .. 
 ఉన్నవి రెండయితే 
 లేనివి జోడించడమే ...

నమ్మకానికే అమ్మలాంటిదని 
 మన్నికలో ఎన్నికైనదని 
 బాకాలు గట్టిగా ఊదడమే 
 కాకాలు ఇక పట్టడమే ...

ఒకటి కొంటే మరొకటి 
ఉచితమంటూ 
 డీజేలతో మోత మోగించి 
 జేబులను కత్తిరించడమే ... 

ప్రముఖులతో పటాటోపం
సగటు జనంతో సరసాలు
అదుపులేని ముచ్చట్లు 
పొదుపు వదిలే ఇక్కట్లు … 


నగునూరి రాజన్న

No comments:

Post a Comment