అలకల గీతం
తేది: 15-12-23
శీర్షిక : సుమ సుందరం.
చిన్ని చిన్ని విషయాలకే
చిలిపి తగవుల ప్రారంభం..
ఊరడింపుల పర్వాలకు
ఊతమయ్యే సందర్భం…
సత్యభామ అవతారం
శ్రీకృష్ణుని ఆరాటం
కలగలిస్తే కోలాహలం
కమనీయపు రసరమ్యం …
అప్పుడప్పుడు ఆలపించాలి
అనురాగపు తీగ సవరించాలి
మౌనగీతం శృతి చేయాలి
మాట పట్టింపులు మన్నించాలి …
అద్దం మీద పెసర గింజలా
అటు ఇటు కదలాడినా
అలిగిన వేళ ముద్దవ్వాలి
ఆలు మగల జగడం ..
ఇనుమడించు ప్రణయాలకు
ఇల్లరికం కావాలి… దరిచేర్చే
ప్రేమలను దత్తత తీసుకోవాలి
సద్దుమణిగిన సందర్భం సుమ
సుందరమవ్వాలి…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment