సమూహ సంఖ్య 41
అంశం:పారవశ్యపు జల్లు.
తేది 29-01-2024
శీర్షిక : తపస్వి…
తొలకరితో పులకరించిన అవనీమాత
పచ్చదనం శోభలు పరుచుకోగానే
కొండాకోనా పారవశ్యపు జల్లులో
మురిసి ముద్దయి పోతున్నాయి...
గ్రీష్మ తాపాలను వెనక్కి నెట్టి
చల్లగాలులను తోడు తెచ్చుకోగానే
జీవారాశి మోములో చిద్విలాసం వెల్లివిరిసి
చిరునవ్వుల కాంతులను
కుమ్మరిస్తున్నాయి...
కొమ్మారెమ్మలు కొత్త చిగుళ్లు
వేసుకోగానే..
కువకువల పలకరింపులతో
చెట్టూ చేమా
గుట్టా చేమంతులై వలస పక్షులతో
కొత్తశోభలను సంతరించుకున్నవి...
అమ్మమ్మ ఇంటికొచ్చిన పాపాయిలా
హాలికుని మోములో కొదువలేని
ఆనందాలు మూటగట్టుకుని
మురిసిపోయి గంతులేస్తుంది ...
సంధికాలపు ఉభయసంధ్యలలో
ఉల్లము పరవశించి ఉత్తేజములను
విసరగా... ఉద్యుక్తుడై నిత్య విధి
నిర్వహణలలో తలమునకలైన తపస్వి ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment