Saturday, June 22, 2024

యువతా ... నీ దారెటు ... తేది : 12-01-2024 శీర్షిక : గుర్తించు విచక్షణతో ....

 యువతా ... నీ దారెటు ... 

తేది : 12-01-2024
శీర్షిక : గుర్తించు విచక్షణతో .... 

యువతే దేశ భవితంటాము 
గతి తప్పక అందరు ప్రవర్తిస్తే 
స్థితి మారదా మాతృ దేశంలో .... 
ప్రగతే ప్రధానమై అడుగిడితే .... 

తల్లి దండ్రుల తపనలు తోడైతే  
గురుబోధనలు ఊతమైతే 
పాలకులు పరిస్థితులు కల్పిస్తే 
ఫలించదా యువత బలం ... 
పాలు పంచుకోదా ప్రగతి మంత్రం .... 

బాల్యములను దాటగానే 
బాధ్యతలను గుర్తించు ... 
మరువకు ఏ క్షణము 
ఏమరుపాటుగా అలసత్వమై .... 

అంతా నేనే ... అంతా నాకేననే 
స్వార్ధము సన్నాసులను చేస్తే ... 
పరుల మేలు సదా కోరే 
త్యాగము గగన శిఖరమౌతుంది .... 

కపటత్వాలు కళ్ళల్లో నింపుకుని 
ప్రలోభాల పాపచింతనలతో 
విషబీజాలను  వినమ్రంగా  గుర్తించి 
విశదమైన అడుగులేయాలి .... 

పచ్చగా ఉంటె ఓర్వలేని 
ప్రశాంతంగా చూస్తే తట్టుకోలేని 
ప్రగతిలో దూసుకెళితే జీర్ణించుకోలేని 
పొరుగు దేశాలను దృష్టిలో ఉంచుకోవాలి .... 

ప్రత్యక్ష యుద్ధాలే కాదు 
పరోక్షంగా మగువలతో వలవిసిరి 
మత్తుమందుల క్రీనీడలతో 
ప్రలోభాల పర్వాలే కాకుండా 
విషజాతుల గతులతో పరోక్షంగా 
వైరస్ లను కూడా పంపొచ్చు .... 

పరాకులన్నీ వీడి అడుగులేస్తేనే 
ప్రతి క్షణం పదిలంగా 
ఫరిఢవిల్లు దేశ భవిత.... 
ప్రజ్వలించు విశ్వవిజేతగా....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment