Saturday, June 22, 2024

చిత్ర కవిత తేది 08-01-24 శీర్షిక : ఇరువైపుల పదును…

 చిత్ర కవిత

తేది 08-01-24
శీర్షిక : ఇరువైపుల పదును… 

మందల కొద్దీ మాధ్యమాల సంఖ్యలతో 
 మనిషిని ఏమార్చుతూ మనుగడను 
 శాశిస్తున్న కలికాలమిది…మంచి చెడుల 
 విచక్షణలతో అడుగేయడమే శ్రేయస్కరం ...

అనుభవాల సంపదలో మణిరత్నం 
అతి సర్వత్ర వర్జయేత్ అన్న నానుడి 
అందరికి అన్నిచోట్లా అమలు చేయ
దగ్గదని మరోసారి ఋజువౌవుతున్న వైనం… 

ముక్కు ముఖంతెలియకున్నా ముఖపుస్తకంలో 
తొంగి చూడటం… దారితెన్ను తెలియకుండానే
యూట్యూబులో పోలోమనడం…ట్విట్టర్లో ఊసులతో
గ్లిట్టర్లను గుర్తించక మోసపోవడంతో ముగింపులు…. 

ఉత్పాదకతలు కొరపడ్డ ఉత్పాతములైనా… 
మత్తుమందులా యువతను ఆకట్టుకుంటూ
అక్కడక్కడ గతి తప్పిన నీతులతో గంతలు
కట్టి గుడ్డివారిని చేస్తూ…గుంతలు తీస్తున్నవి… 

ఇరువైపుల పదునైన కత్తిలాంటి మీడియాను 
ఇగురంగా వాడుకోవడమే ఇంపైన విచక్షణ… 
ఆదమరిచి అడుగేస్తే అసలుకే ఎసరై… 
ఎరకు చిక్కిన ప్రాణంలా గిలగిలలాడాల్సిందే…

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment