నూతన సంవత్సరం
తేది 27-12-23
శీర్షిక : సర్వే జనా సుఖినోభవంతు.
దర్పణం సాహిత్య వేదిక
హ్యాపీ న్యూ ఇయర్ అందామని
ఆకాశమంత పందిరి వేసి
ఆనందాలను అందరితో పంచుకోవాలని
అచ్చమైన ఆశతో మనసు ఉవ్విల్లూరినా...
బుద్ది ఎందుకో మొరాయిస్తున్నది
మౌనంగా మారిపోయే కాలగమనంలో
కార్యశీలతలు లేవనుకుందేమో ...
ఆయనంలో మార్పులు కానరాక
అలసత్వముగా
ఊపిరి తీసుకుంటున్నదనేమో..
అజ్ఞానులనుకుంటున్న పశుపక్ష్యాదులలో కూడా
జడత్వమే వాటేసుకున్నదని గ్రహింపేమో…
చెట్టు చేమలో గుట్ట గూడులో కానరాని
చిగురులేయని చైతన్యం చూసి కామోసు…
నోరు తీపి చేసుకుని ఊరును పలకరిద్దామంటే..
సుద్దమొద్దు రారా అర్దరాతిరని… సద్దు మనిగాక
నిద్దురలేపి పాచి కేకులతో పరాచికాలు…
సుక్క మందులతో సుద్ది ముచ్చట్లు ఇష్టం కాకనో….
వింతగా విజ్ఞానంలో మిన్నని విర్రవీగే
మనిషి.. వితరణశీలి కాలేక.. నేనే గొప్పనే
మనస్తత్వంతో… సాటి మనిషిని సదా
పడదోయాలనే
పడమటింటి నీతికి
పట్టం కట్టలేకనేమో…
సర్వే జనా సుఖినోభవంతు అనే సూత్రానికి
పట్టంకట్టాలనే నిండారు ఆశలవల్లనో…
తెలియని పరధర్మం కన్నా తెలిసిన మన ధర్మం
మిన్ననే గీతాచార్యుని బోధనలకు దాసోహమయో…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment