Sunday, June 23, 2024

గజల్ సమూహ సంఖ్య 41 తేది : 26-01-2024

 గజల్

సమూహ సంఖ్య 41 
తేది : 26-01-2024
చతురస్ర గతి ... 
 
అరణ్య వాసము పద్నాలుగేళ్లు 
అప్పుడెప్పుడో తీరెను రామా .... 
వందల ఏండ్లుగ వరసగ పోరగ 
వరములీయగా  వచ్చెను రామా... 

దశరథ కొమరుడు ధర్మం కోసం   
బాల రాముడిగ బహుమతి తానై 
కోసల దేశపు అధిపతి రూపం 
సరయూ తీరము చేరెను రామా ... 

భాసురమై వెలుగులు పంచుతూ 
వాసిగ అయోధ్య పురంబులోనా 
సౌమిత్రి సోదరుగ సుందరమున 
సందడి బహుగా చేసెను రామా ... 

చిరునగవులు నిండిన దరహాసం 
చిన్ముద్రలతో దక్షిణ హస్తం 
విల్లంబులు చేత వామహస్తం 
భంగిమలతోడ వెలిసెను రామా ... 

కళ్లలో కమనీయపు కాంతితో 
మెరుపులీనగ చిన్ని బుగ్గలపై
కరుణారస సుధలు అధరములపై  
రాజ ఠీవిగా నిలిచెను రామా !

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment