చిత్ర కవిత ( సీతా రాములు)
తేది : 22-01-2024
శీర్షిక : సీతా రాముల కళ్యాణం
సీతా రాముల కళ్యాణం
జగమంతా నిలిచిన వైభోగం
కనుల పండగే ఆ పర్వం
కమనీయమైన దృశ్య కావ్యం ....
దేశమంతా మారుమోగింది
దశదిశలా తెలిపి చాటింది
యుగాలనాటి ఉత్తముడు
మర్యాద కలిగిన పురుషోత్తముడు ....
అమ్మకు మాయ కమ్మితే
అయ్యాము శిక్షార్హం పదునాలుగేళ్ళు ....
స్వార్థం సవారి చేసిన ఫలం
ఐదువందలేళ్ళు మాకు వియోగం ....
అయినా ఆగని కళ్యాణం
ప్రతి ఏటా పరవశాలే ....
శతాబ్దాల నిరీక్షణలకు
శత కోటి వందనాలు ....
కరుణించి కటాక్షించావు
కదిలి నిరీక్షణలకు తెర దించావు ....
బాల మూర్తిగా బైలెల్లినావు
రామచంద్రమూర్తిగా రంజిల్లినావు. .
నగునూరి రాజన్న
No comments:
Post a Comment