Saturday, June 22, 2024

నిద్ర తేది: 07-01-2024 శీర్షిక : కరువౌతున్న నిద్ర.

 నిద్ర 

తేది: 07-01-2024
శీర్షిక : కరువౌతున్న నిద్ర. 

చీకటి వెలుగుల చక్కని నిర్వచనం 
అలసిన దేహాన్ని ఆవహించే ముద్ర 
పునఃశక్తిని పుంజుకునే మంత్రం
ఆరోగ్య రహస్యాల ఆది మూలం… 
యోగాలో కూడా చేర్చిన శవాసనం… 

ధర్మం పాదాలు దారి తప్పుతుంటే 
మర్మం ఎరుగని కనురెప్పలు కవాతు 
మరిచిపోయి కాపలా చేస్తున్నాయన్న 
భ్రమలో కొట్టుమిట్టాడుతున్నాయి... 

వత్తులేసుకుని పహారా కాస్తున్నా 
కత్తులు నూరుతున్న విషయం 
కనిపెట్టలేక బిక్కవోయి చూడటమే 
చాలాసార్లు మనవంతు అవుతున్నది ...

మానవుని మనుగడకు సంఘమే 
 సర్వస్వమని నమ్మినా నట్టేట ముంచుతూ.. 
 అమాయకత్వాలను ఆటపట్టిస్తూ .. 
 నటనలతోనే వెనుక నవ్వుకుంటుంది ... 

తెల్లవారినదగ్గరనుండీ తెమలని 
 పెట్టుబడిదారుల మాయలతో వట్టిబోతున్న 
కార్మిక కుటుంబాలు..రాజకీయ రంగంలో ఆరితేరిన సప్తవర్ణాల ఊసరవెల్లి మోసాలు ..
రౌడీయిజంతో పెట్రేగుతున్న దాఖలాలు 
 టెర్రరిజంతో లెక్కలు దొరకని అగచాట్లు .. 

సత్యం కనుమరుగయి ధర్మం దర్శనమీయక 
న్యాయం చేరదీయక నడివీథిలో విడిచిన 
వేలమంది స్త్రీల కనుమరుగు..లక్షల మంది అనాదలౌతున్న బాలలు వెరసి కంటిమీద 
కునుకు కరువు... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment