Wednesday, June 19, 2024

ప్రేరణ తేది: 06-12-23 శీర్షిక : ఆత్మ విశ్వాసాలకు అంకురం.

 ప్రేరణ

తేది: 06-12-23
శీర్షిక : ఆత్మ విశ్వాసాలకు అంకురం.  

నిరాశల ఊబిలో మునిగిపోయినప్పుడు 
నిచ్చెనలా ఊతమై ఒడ్డుకు చేర్చును .. 
వంతెనలా వారధియై నిలిచి సారధిగా
సందర్భాలను సమఉజ్జీలుగ నిలుపును…. 

ప్రేరణెప్పుడైనా పెద్ద పాత్రనే పోషించు 
పెన్నిధిగా లీనమై పొదువుకుంటే 
సన్నిధిగా తోడు నిలిచి సంభావ్యమగు.. 
ద్రోణ విగ్రహములా నిగ్రహమున ఏకలవ్యునికి ... 

చెప్పే వానికి వినేవాడు లోకువ అనుకోకుండా..
మంచిని ఎంచుకుని వంచనలను 
దాటుకుని కాంచన విజయాలను 
టంచనుగా చేజిక్కించుకోవడమే ... 

ప్రకృతి పరిసరాలే పటుతరముల 
పరమోన్నత ప్రేరణల పెద్దన్న ఎప్పుడైనా ఎవరికైనా…
పశుపక్ష్యాదుల సమయస్ఫూర్తులే
పాటించగలిగే ప్రవర్తనలై పాఠములుగ బోధించు… 

ఆత్మవిశ్వాసాలకు అంకురమై 
 దీక్షా దక్షతలకు మార్గదర్శకమై 
 పట్టుదలలకు పెట్టుబడిగా మారి 
 ఫలితాల రాబట్టుటలో మెట్టుగా మారు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment