శరత్కాల శోభ
తేది : 24-01-24
శీర్షిక : స్వచ్ఛతల గుచ్ఛం ...
మట్టి వాసనలు వీడిన నీరు
మలినమంటని తేటదనంతో
మంద్రగమనమున పారు
సెలయేళ్ళ సుందరములు ....
వెనుకబడిన వర్షాకాలముతో
వనమంతా ఆకు రాలుతున్నా ....
తేమనిండిన చిత్తడి నేలలలో
తీరైన రంగుల గడ్డి పూల అందాలు ....
శివారాధనలకై తహ తహలాడే
కమ్మని తేనెల కమండలములతో ...
కళకళ లాడుతూ కాషాయవర్ణముల
మెరుపులీను గోగుపూలతో .....
నిర్మలమైన ఆకాశములో
నిండైన శోభలే... నీరెండను బోలు
నిశి వెలుగుల పండు వెన్నెల నిండిన
పున్నమి రాత్రులు ...
సంధికాలము సౌకర్యవంతమవగా
ప్రకృతి పరిసరాలన్నీ రెళ్ళు పూల
పరిమళాలతో నిండి స్వచ్ఛతల గుచ్ఛమై
శోభాయమానముల నయన మనోహరమే.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment