Saturday, June 22, 2024

పరివర్తన 28-12-23 శీర్షిక: పరుల మేలు కోరడం…

 పరివర్తన 

28-12-23
శీర్షిక: పరుల మేలు కోరడం… 

 తాటిచెట్టుకు తమ్మున్నని 
 మర్రిచెట్టుకు సోదరున్నని 
 అడవికున్నంత అనుభవమున్నదని 
 అహం వదలని బ్రహ్మాస్మి అవుతే 
 లాభమేమిటి... 

 సంప్రదాయంలో సద్గురువునని 
 సంస్కృతిలో సమున్నుతున్నని 
 ఆచారంలో ఆచార్యున్నని 
 గర్వం వీడని గాంధర్వుడవైతే 
 లాభమేమిటి…

విజ్ఞానంలో వీరబ్రహ్మమునని 
 ప్రజ్ఞలో ప్రద్యుమ్నుడినని 
తెలివిలో తెనాలి రామకృష్ణున్నని
 స్వార్థం వీడని సరంగువైతే లాభమేమిటి… 

సంద్రములాంటి విజ్ఞానంలో 
జీవితాంతం చదివినా… కొంతేనని తెలువు.. 
అందరూ అన్ని నేర్వలేరనే జగద్విఖ్యాత 
భువన నిజాన్ని ఎరుకపర్చుకున్నప్పుడే.. 
హిమశిఖరమౌతావు… 

ఎక్కడ తగ్గాలో తెలిస్తే ఎక్కడైనా 
నెగ్గగలవు …పరివర్తన చెందని 
మనిషి ఫలించని వృక్షంతో సమానం...
పరుల మేలు కోరడమే పరివర్తన. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment