Wednesday, June 19, 2024

అంశం : ఇంధనం పొదుపు --తేది :14-12-23--శీర్షిక : చేయందించు

 తేది :14-12-23

అంశం : ఇంధనం పొదుపు 
శీర్షిక : చేయందించు 


పల్లె పట్నం తేడాలసలే లేవు 
పొగలేని పొయ్యి తయ్యారు 
కాదంటే ప్రాణాలు ఉస్సూరు 
వీలుంటే పొదుపుతో పొందు లాభం ... 

ఆడా మగా తేడాలు లేనేలేవు
చిన్నా పెద్దా దూరాలకైనా 
ఇపుడు ఏదో ఒక్క వాహనం 
కాదా ఖర్చిక ఇంధనం ... 
పెట్రోల్ డీజెల్ ల పెరిగే ఖర్చులు. 

చమురు దీపాల చర్చలు లేవు 
జిలుగు వెలుగుల జిగేల్ దీపాలు 
విద్యుచ్చక్తికి విలువలీయండి
వీలైనప్పుడల్లా పొదుపు చేయండి... 

నిత్య సత్యమైన నీరాజనాలు 
 ప్రతి ఇంట అవసరాల పంట 
 ఏ సి ఫ్రిడ్జి గీజర్ వాషింగ్ మషీన్లు 
 కార్లు మోటారు సైకిళ్ళు  మొదలైనవి… 

కాలానుగత యంత్ర నిర్వహణలు కూడా 
కమనీయ ఇంధన పొదుపులై 
 కనికట్టు చేయవా వాడకంలో ... 
 కాలుష్యములు సైతం నియంత్రించు ... 

ప్రత్యామ్నాయాలను పరిశీలించడమే 
 పటుతరమైన మేధోసంపత్తి ... 
 సంప్రదాయేతర ఇంధనాలు 
 సదా కోరు మానవాళి సంక్షేమం ... 

 సంద్రపు అలలతో సర్దుకోగలిగినా 
ఇగురమైన ఇథనాల్ ఇంధనమైనా 
గాలిమరల గమ్మత్తులైనా ...
సగౌరవమైన సోలారులైనా ... 
ఇంధన పొదుపుల సందళ్ళే… 

కాలుష్యాలు కన్నెర్ర చేస్తుంటే 
కకావికలమే ప్రజా జీవితం… 
కలుషితాలు కాటేసిన నీటితో 
అరికట్టలేని అనారోగ్యాలు… 
నీటివృదాను సైతం అరికట్టండి… 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment