తెరలు తెరలుగా
తేది 06-12-2023
శీర్షిక: మరుపు మానవ సహజం.
రైలులాంటి జీవన పయనములో
ఎక్కేవారు
దిగేవారికి లెక్కేలేక..
జ్ఞాపకాల పందిరిలో
తమకములో
మునకలేయక పరిమళించే
కుసుమ
శోభితములెన్నో
తడారు గొంతులో పొడారు దుఃఖ సంఘటనలెన్నో…
తామర తంపరలే
తాత్కాలికములో నిక్షిప్తములౌతూ ...
మరుపు మానవ సహజమనే
మూలసూత్రమే సుమా…లెక్కలు పక్కాగా
గ్రంథస్తములైనా…చరిత్రలన్నీ పుటలకెక్కినా…
చర్వితచరణములయ్యే కొన్ని విషయాలు తప్ప….
గ్రంథస్తం చేయని అనేకానేక అనుభవాల మాలలు
సర్వాంతర్యామిలా సాంతంగా కాకపోయినా
సగం సగం సందర్భాలైనా సరే బాల్యపు నీడలలోని
బంగారు ఛాయలెన్నో బలంగా
గుర్తుండిపోయి సడి చేస్తుంటాయి
హృదయ సంద్రపు గది మూలలలో ...
అంతా గుర్తున్నట్టే అనిపించినా …
ఆద్యంతములలో కొంత మరుపయి
వింతగా తోచు మన పనులు మనకే
ఇంత అపరిపక్వతల ఏల మసులుకున్నామని ...
అందుకే మొక్కై వంగనిది మానై వంగునా
అని
సుద్దులు బోధిస్తుంది... తెలిసి చేసినా
తెలియక చేసినా… పాపపుణ్యాల పంచాంగములో
లెక్కలన్నీ సరి చూసుకుంటుదనే
సంప్రదాయపు
సంస్కృతిగా మహోన్నతమైన మన హైందవం..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment