శ్రీపదాలు
1. కార్మికులకు కర్షకులకు అభినందనలు.
స్వార్థంవీడి సమాజమే సొంతమనుకుంటున్నందుకు…
ఫలితమాశించక పనియే దైవమనేభావనకు….
01-05-23
శ్రీపదాలు

2. ఐదువేళ్ళు అందించును ముద్ద.
పనికి దేహం కుదువపెడితేనే…
రుధిరం స్వేదమై పరిమళిస్తేనే…
01-05-23
శ్రీపదాలు

3. కాలంమరిచి కన్నెఱ్ఱచేసాడు వరుణుడు.
కర్షకుని కష్టాలను గుర్తంచకనేమో..
పాలకుల పక్షమై జతకట్టెనేమో….
01-05-2023
శ్రీపదాలు

1. బంగళాలలో బసచేసిన దూరవాణి.
వేన్నీళ్ళకుచన్నీళ్ళలా వేలాదిమందికి వేగుచుక్కలా…
పిసివోగా పాగావేసింది వీధులలో…
03-05-23
శ్రీపదాలు

2. పలకరింపుల పరిమళాలు చరవాణితో.
చదువులకు, ఉద్యోగాలకెళ్లిన పిల్లలతోనయినా ....
దూరానున్న బంధుమిత్రుల బలగముతోనైనా ...
03-05-23
నగునూరి రాజన్న
శ్రీపదాలు

3. రెండువైపులా పదునైనకత్తి తెరలవాణి .
అందిపుచ్చుకుంటే ఆత్మబంధువే అందరికి.
అలసత్వమైతే శత్రువే కొందరికి ..
03-05-23
శ్రీపదాలు

1. కాలమెందుకో కారుమేఘమై కన్నెర్రజేసింది.
హాలికులకు శోకాలను మిగుల్చుతూ ....
చేతికందిన పంటలను నోటికందించక ....
03-05-23
శ్రీపదాలు

2. కారుమేఘాలలో కలిమాయల పయనం.
పంటచేలను పూలవనం చేయలేక ...
ధాన్యపుగొలుసులను ధరణీతలంపై కూల్చుతూ…
03-05-23
శ్రీపదాలు

3.
శ్రీపదాలు
1. బంగళాలలో బసచేసిన దూరవాణి.
పీసీఓగా అవతరించి ఆదుకున్నది .
వేన్నీళ్ళకుచన్నీళ్లలా వేలాదిమందికి
వెసులుబాటయ్యింది.
03-05-23
శ్రీపదాలు
2. పలకరింపుల పరిమళాలు చరవాణితో.
చదువులకు, ఉద్యోగాలకెళ్లిన పిల్లలతోనయినా ....
దూరానున్న బంధుమిత్రుల బలగముతోనైనా ...
03-05-23
శ్రీపదాలు

1. అప్పులతిప్పళ్ళతో అతుకుల బతుకులు.
ఆశలు గడపదాటి అత్యాశలైపోతే…
ఆదాయవ్యయాల సంతులనంలో అసమతుల్యతలెదురై….
05-05-23
శ్రీపదాలు

2. గొప్పలు గప్పాల నిప్పులైపోతాయి.
విచక్షణలు విడ్డూరాల గుర్రాలెక్కితే…
వికృతవేషాలు వింతలుగా ప్రవర్తిస్తే…
05-05-23
శ్రీపదాలు

3. కొండమీది కోతిని అందుకోబోతారు.
అప్పులకుప్పల్లో రొప్పుతూనైనా సరే…
అపాయాల అంబులెన్సులు ఎక్కైనా…
05-05-23
శ్రీపదాలు

1.జీవరాశిలోనే మిన్నంటూ డాంబికం.
ప్రలోభాలకు పడిపోయే ప్రగల్భాలపుట్టరా….
ఆశపెడితే ఆశయాలను వదిలిపెట్టురా….
(మనిషి డొల్లతనం వ్యంగధోరిణిలో)
08-05-23
శ్రీపదాలు

2.కష్టేఫలి కాకమ్మకథ కాదు.
కల్పవృక్షమైనను కానవచ్చె చిలికితేనే…
కనువిప్పుగా బోధించే పురాణమైననూ…
08-05-23
శ్రీపదాలు

3. అప్పులతిప్పళ్ళ అతుకుల బతుకులే.
ఆశలు గడపదాటి అత్యాశలైతే…
ఆదాయవ్యయాల సంతులనం చెదిరితే…
08-05-23
శ్రీపదాలు

1. సాంకేతికతతో సంబరం మాయమౌతుంది.
ప్రయోజనాలకన్నా ముందుగానే దుర్వినియోగాలనిస్తూ….
ఆనందాలకంటే ఎక్కువ అనర్థాలనిస్తూ….
09-05-23
శ్రీపదాలు

2. మానవీయతల పచ్చనివనం మాడిపోతున్నది.
కరెన్సీపూల పరిమళం విషంకక్కుతుంటే….
స్వార్థాలు అంటుమొక్కలుగా హైబ్రీడులైపోతుంటే…
09-05-23
శ్రీపదాలు

3. బంధాలన్నీ కాటగల్సి పోతున్నాయి.
పారిశ్రామికాల ప్రగతి పరుగుపందెమో…
పాశ్చాత్యుల పడగల నీడలో….
09-05-23
శ్రీపదాలు

1. విజేతలై ఎవరైనా నిలబడవచ్చు .
మనల్ని మనం ప్రేమించుకోగలిగితే…
గెలుపంత సులువు కాకపోయినా …
10-05-23
శ్రీపదాలు

2. విజయాలకు ఎక్కడైనా తిరుగులేనిపట్టమే.
గెలుపంటే అదొక ఊపు….
అదందితే వెయ్యేనుగుల బలం….
10-05-2023
శ్రీపదాలు

3. గెలుపు ఆషామాషీగా దక్కదు.
ప్రణాళికలతో పాదాలు కదలాలి…
తర్కాలతో తమాయించుకుని సాగాలి….
10-05-23
శ్రీపదాలు

1.సుడిగాలిలా దూసుకొచ్చింది రవాణా.
నాగరికత నడకలలో పలువిధాలుగా…
పారిశ్రామికీకరణ పదనిసల పరుగులతో…
12-05-23
శ్రీపదాలు

2.మానవాళికి మచ్చలుగా మిగులుతున్నాయి.
కుంటుపడిపోతున్న నేటికాలపు కుటుంబబంధాలు...
మరిచిపోతున్న మానవత్వపు విలువలు...
12-05-23
శ్రీపదాలు

3.మమతలపందిరి విరుగు చూపింది.
ఆశలు అత్యాశలై పేరాశలైపోతూ...
సాటిమనుషులపై సన్నగిల్లుతున్న ప్రేమలతో….
12-05-23
శ్రీపదాలు

1.సాధించుకుంటేనే బంధమై నిలుస్తుంది.
వాదనలో ఒకరికే విజయంకాకుండా…
చర్చించుకుంటే ఇద్దరికి గెలుపుతో….
15-05-23
శ్రీపదాలు

2. అన్నీ కలగలిస్తేనే జీవితం.
కలకాలం నిలవని కష్టాలు…
ఎప్పటికీ ఉండిపోవాలనుకునే సంతోషాలు….
15-05-23
శ్రీపదాలు 

3. నిరాకారుడు నీలకంఠుడు బోళాశంకరుడు.
చెంబెడు గంగకే పొంగిపోతూ…
గంపెడు కోరికలను తీర్చేస్తూ….
15-05-23
శ్రీపదాలు

1. రాయబడని కావ్యాలు ఎన్నో?
పునాదిరాళ్ళలా కనపడని శ్రామికులవి…
పుణ్యమూర్తులైన అన్నపూర్ణనందించే రైతులవి…
16-05-23
శ్రీపదాలు

2. పరిపక్వతలపండ్లు ఏరుకుని తినాలంటే!
అనుభవాల జాడలలో తచ్చాడాలి…
పరిమళాలతోటలలో సుగంధాలు అద్దుకోవాలి.
16-05-23
శ్రీపదాలు

3. పదాలన్నీ గుమిగూడితే పరిమళాలే.
కంటపడ్డ కమనీయమైన దృశ్యమో…
ప్రకృతి పండించిన మనోహరమో…
16-05-23
శ్రీపదాలు

1. బుద్ది నేర్చుకుని గుణవంతులయ్యిరి.
ఊరుకొక్క ఉపాధ్యాయుడు ఉన్నరోజుల్లో…..
బెత్తములు విరిగినపుడు వీపులపై …
22-05-23
శ్రీపదాలు

2. పెట్టిపుట్టెనని ప్రేమించు ప్రజలు.
చిన్నవయసున అన్ని సమకూరినా…
సుఖములందు మనిషిని చూసినా…
22-05-23
శ్రీపదాలు

3. కాలమెపుడు ఉత్కంటత ఉద్రేకములే.
కలుపుకుని సాగిందా కర్షకసంజీవినియే….
కన్నెర్రజేసిందా కాటేసే కాలనాగే…
22-05-23
శ్రీపదాలు

1. కాలఖడ్గానికి తల ఒగ్గాల్సిందే.
ఎదురెళ్ళి నిరోధించేది కాకపోయి…
ఆదరించే ఆదర్శము లేకపోయినా…
23-05-23
సవరణతో….
శ్రీపదాలు

2. ప్రాంతీయ చరిత్రలను పదిలపరచాలి.
కవులంతా వెదికి గ్రంథస్తముచేస్తూ….
మరుగుపడిన
గట్టెపల్లిమురళిలాంటి ఘనచరితలతో ….
23-05-23
శ్రీపదాలు

3. శంకలేని శబ్దమే చైతన్యవంతం.
ఓంకారానికి పుట్టిల్లు దినకరస్థావరముకాగా…
ప్రాణవాయువుల పయనము
రాగతరంగమై…
23-05-23
శ్రీపదాలు

2. ఆచారాలు సంప్రదాయాలు సమున్నతం.
అవపోశనపట్టి సరిగ్గా అన్వయించుకోగలిగితే…
అలవోకగ కలగల్సినదే హైందవం…
25-05-23
అవపోశనపట్టి సరిగ్గా అన్వయించుకోగలిగితే…
అలవోకగ కలగల్సినదే హైందవం…
25-05-23
శ్రీపదాలు
1. ఆచారాలన్ని అనుభవాల పూదోటలే.
సంస్కృతికి కొమ్మలు రెమ్మలే…
సంప్రదాయపు పరిమళాలు చిలకరించుకోగలిగితే…
25-05-23

1. ఆచారాలన్ని అనుభవాల పూదోటలే.
సంస్కృతికి కొమ్మలు రెమ్మలే…
సంప్రదాయపు పరిమళాలు చిలకరించుకోగలిగితే…
25-05-23
శ్రీపదాలు
3. సనాతనమైనా సన్నుతించబడె సర్వోత్తమమై.
కరోనా కష్టాలను గట్టెంకించంగా..
ఆచారసంప్రదాయములే అసలైన ఔషధములుగా….
25-05-23

3. సనాతనమైనా సన్నుతించబడె సర్వోత్తమమై.
కరోనా కష్టాలను గట్టెంకించంగా..
ఆచారసంప్రదాయములే అసలైన ఔషధములుగా….
25-05-23
No comments:
Post a Comment