Saturday, June 22, 2024

సంస్కరణ బీజాలు తేది: 20-12-23 శీర్షిక: సంఘ సంక్షేమాలు

 సంస్కరణ బీజాలు 

తేది: 20-12-23
శీర్షిక: సంఘ సంక్షేమాలు

కొన్ని స్వార్ధపు సంకెళ్లు స్థావరాలను
బందీగా చేసుకున్నా ... అక్కడక్కడా 
ఆరాటాల తలలు నలుగురి క్షేమాలను 
నెత్తికెత్తుకుని నడిచిన దాఖాలాలెన్నో ... 

జనారణ్యంలో కొన్ని గోముఖ 
వ్యాఘ్రాలున్నట్టే… మరికొన్ని ప్రజా
సంక్షేమాలకు పరితపించే సాధు
జన సంతులు కూడా ఉన్నారు…. 

సంఘమే దేవాలయమనే భావనలే 
చరిత్రలో వారికి పేజీలు కేటాయింపజేసి
తరాలకొద్దీ తలుచుకునే భావనలు నింపి
పుణ్యపు పూజనీయతలతో పట్టం కట్టింది… 

మానవీయ కోణంలో మార్పు కోరడం 
మార్పు మంచిదయితే భుజమాన్చితే
మరోతరానికి వారు మార్గదర్శకులే ... 
సంస్కరణలకు శ్రీకారమే నాంది ప్రస్థానమే… 

సతీ సహగమనాల విముక్తి కి 
సర్వం ఒడ్డి సవాలు చేసిన
రాజారాం మోహన్ రాయ్ 
సదా స్మరణీయుడే కదా ... 

వర్గం లేని వంగర వాసి ఆనాడు
స్వర్గతుల్య పాలనలందించె… 
అపర చరకుడై చికిత్స చేసాడు 
ఆర్థిక రంగ ఋగ్మతకు భారతాన….

జాతీయత భావము విత్తు నాటిన 
గోపాలకృష్ణ గోఖలే .. భారతీయతను 
విశ్వవీధిన చాటిన నరేంద్రుడు… 
తెలుగు భాషను వెలుగు నింపిన 
గిడుగు రామ్మూర్తిగారు….ఎందరెందరో 
మహానుభావులు అందరికి వందనాలు…

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment