Saturday, June 22, 2024

రామామృతం శ్రీ రామ కవిత్వం తేది : 23-01-2024 శీర్షిక : బాల రాముడు ...

 కవి స్వరం  సాహిత్య వేదిక 

అంశం : రామామృతం శ్రీ రామ కవిత్వం 
తేది : 23-01-2024
శీర్షిక : బాల రాముడు ... 

బుడి బుడి అడుగుల 
బాలరాముడు 
భువికి చేరెను ...  
అదిగో చూడుడు .... 

సరయూ నది తీరమున  
సౌమిత్రికి ప్రియములతో  .... 
కోసల దేశాధిపతి నీకు   
కోటి కోటి ప్రణామములు .....  

వందలేండ్ల నిరీక్షణలకు 
తపో వరసంపత్తిగా .... 
బాసురమై వెలుగొందేనే 
వాసిగా అయోధ్యలోనా .... 

బుడి బుడి అడుగుల 
బాలరాముడు 
భువికి చేరెను ...  
అదిగో చూడుడు ....

చిరునగవుల దరహాసం 
చిన్ముద్రల దక్షిణ హస్తం…
విల్లంబులు చేకొన్న 
వామహస్త భంగిమలతో ....
       
కారు చీకటి కాంతి పుంజం
కనులలోనఁ మెరుపులు....
కాంతులీను బుగ్గలపై 
కరుణ సుధలే అదరములలో .... 

బుడి బుడి అడుగుల 
బాలరాముడు 
భువికి చేరెను ...  
అదిగో చూడుడు ....
 
అందమైన నీ రూపము
ఆనందమే  మదిమదిన …
భవ్యమైన గుణశీలతలు
యుగములైన కొలతలే…. 

ఆదర్శము నిన్ను చూడ  
ఆత్మీయతల నిర్వచనం....   
అనురాగం నీ వెంటే 
అన్నదమ్ములనుబంధం  .... 

బుడి బుడి అడుగుల 
బాలరాముడు 
భువికి చేరెను ...  
అదిగో చూడుడు ....

బంగారు కోవెలలో 
బాల రామ ప్రతిష్టాయే .... 
ఊరు వాడ ఒక్కటాయె
రామనామ జపములాయే…

మననమే పుణ్యమని 
మనసంతా నమ్మినాము. 
ఘనమైన అదృష్టమే
ప్రాణ ప్రతిష్ట వీక్షించగ .... 

బుడి బుడి అడుగుల 
బాలరాముడు 
భువికి చేరెను ...  
అదిగో చూడుడు ....

No comments:

Post a Comment